Rubaiya Sayeed: 1989 కిడ్నాప్ కేసులో సీబీఐ కోర్టుకు మెహబూబా ముఫ్తీ సోదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా సయీద్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరై 1989 నాటి కిడ్నాప్‌కు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసులో రుబయ్యా సయీద్ తొలిసారిగా కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ ఆగస్టు 23న జరగనుంది. ఆ తేదీన కూడా హాజరు కావాలని రుబయ్యాకు కోర్టు ఆదేశించింది.
మెహబూబా ముఫ్తీ సోదరి రుబయ్యా సయీద్‌ను డిసెంబర్ 8, 1989న జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) తీవ్రవాదులు అపహరించారు. తీవ్రవాద నిధుల కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న యాసిన్ మాలిక్, ఇతరులకు ఈ కేసులో సంబంధం ఉంది. “ఈరోజు కోర్టులో సాక్షి రుబయ్యా సయీద్ వాంగ్మూలం నమోదు చేయబడింది. ఆమె యాసిన్ మాలిక్‌ను గుర్తించింది. తదుపరి విచారణ ఆగస్టు 23న ఉంది. ఆమె మొత్తం నలుగురు నిందితులను గుర్తించింది” అని సీబీఐ న్యాయవాది మోనికా కోహ్లీ తెలిపారు.
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్‌మైండ్!
Supreme Court: సుప్రీంకోర్టు పనివేళలు మారతాయా?.. సీనియర్ జడ్జి కీలక వ్యాఖ్యలు.
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా యాసిన్ మాలిక్ ఈరోజు కూడా ఈ కేసులో హాజరయ్యాడని సీనియర్ న్యాయవాది, పీడీపీ అధికార ప్రతినిధి అనిల్ సేథీ వెల్లడించారు. ఈ కేసులో భౌతికంగా జమ్మూలో హాజరు కావాలని కూడా అభ్యర్థించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో ఎన్ఐఏ కోర్టు ఈ ఏడాది మేలో వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది. మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఎన్ఐఏ కోర్టు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. అతనికి రెండుసార్లు జీవిత ఖైదు పడింది. మే 19న దోషిగా తేలిన వేర్పాటువాద నేతకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ కోరింది.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!