Site icon NTV Telugu

Donald Trump: భారత్కి 21 మిలియన్‌ డాలర్లు ఎందుకివ్వాలి.. వాళ్ల దగ్గరే చాలా డబ్బులున్నాయి..

Donald Trump

Donald Trump

Donald Trump: భారత దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి అందిస్తున్న 21 మిలియన్‌ డాలర్ల సహయాన్ని ఇటీవల యూఎస్ నిలిపి వేసిన విషయం మన అందిరికి తెలిసిందే. ఈ నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలపై ప్రిసిడెంట్ ట్రంప్‌ మంగళవారం నాడు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసలు ‘ఇండియాకు 21 మిలియన్‌ డాలర్ల సాయం ఎందుకివ్వాలి అని ప్రశ్నించారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాపై వాళ్లు భారీగా ట్యాక్సులు వేస్తున్నారని ఆరోపించాడు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు.

Read Also: Srisailam MahaShivaratri Brahmotsavam: నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు!

ఇక, అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై ఏప్రిల్‌ 2 నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. అయితే, ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యూఎస్ లో పర్యటన ముగిసిన వెంటనే టెస్లా అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) భారత్‌కు సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం భారత్‌కే కాకుండా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ తదితర దేశాలకు అందించే సాయాన్ని కూడా అమెరికా సర్కార్ ఖర్చులు తగ్గించడంలో భాగంగా డీవోజీఈ ఆపివేసింది.

Exit mobile version