NTV Telugu Site icon

Asaduddin Owaisi: “మాకు టికెట్ ఇస్తే హిందువుల ఓట్లు రావని”.. ఇండియా కూటమిపై ఓవైసీ ఫైర్..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. సోమవారం ఓ కార్యక్రంలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కూటమిలోకి తమను ఆహ్వానించకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూటమిలో భాగం కానని, దానితో ఉంటే నరకం అని, కూటమిలో చేరితో ఉక్కిరిబిక్కిరి అయ్యేదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. కూటమిలో చేరడానికి తమకు ఆహ్వానించపోవడాన్ని తాను పట్టించుకోనని అన్నారు.

‘‘నేను ఇండియా కూటమిలో లేనిని.. దాన్ని పట్టించుకోనని, ఇండియా కూటమి సిద్దాంతాలు బీజేపీకి ఎందుకు వ్యతిరేకంగా నిలవడం లేదు. మాకు టికెట్ ఇస్తే వారికి హిందూ ఓట్లు రావని అనుకుంటున్నారు, వారు మూసిన గోడల వెనక ఇలాగే మాట్లాడుతున్నారు, ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెబుతున్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Punjab: పంజాబ్‌లో కాంగ్రెస్ నేత హత్య.. తామే చంపామన్న ఖలిస్తానీ ఉగ్రవాది..

2018 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓడిపోవడాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోతే, వయనాడ్ నుంచి ఓడిపోకుండా అప్పుడు రక్షించింది ముస్లిం లీగ్ అని ఓవైసీ అన్నారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు, వయనాడు నుంచి గెలిచారు, అక్కడ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయలేదు, అక్కడ బీజేపీతో నాకు ఎలాంటి ఒప్పందం లేదు, అయితే అక్కడ ముస్లిం లీగ్ ఉంది, కాబట్టే ఆయన వయనాడ్ నుంచి గెలిచాడు, రాహుల్ గాంధీ మునిగిపోకుండా కాపాడిందని ఓవైసీ అన్నారు.

ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వ సంస్థలు దాడులు చేస్తుంటే, ఎంఐఎం నేతలపై ఎలాంటి కేసులు లేవని, వారికి బీజేపీ, ప్రధాని మోడీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ఆరోపించిన తర్వాత ఓవైసీ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒక్క టీఆర్ఎస్ తోనే కాదు బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతోందని అన్నారు. బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టే కేసీఆర్, ఎంఐఎం నేతలపై ఎలాంటి కేసు లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.