Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Isro Sets Date For Launch Of Aditya L1 Solar Mission All You Need To Know

Aditya-L1 Solar Mission: సూర్యుడి గుట్టు తేల్చనున్న “ఆదిత్య ఎల్1”.. అసలేంటీ ఈ ప్రయోగం.. ఎంతదూరం ప్రయాణం..?

Published Date :August 28, 2023 , 5:21 pm
By Venu Goapl Reddy
Aditya-L1 Solar Mission: సూర్యుడి గుట్టు తేల్చనున్న “ఆదిత్య ఎల్1”.. అసలేంటీ ఈ ప్రయోగం.. ఎంతదూరం ప్రయాణం..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Aditya-L1 Solar Mission: చంద్రుడిపై గట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించి ఇటీవల సక్సెస్ అయింది. చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అత్యంత కఠినమైన దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో చంద్రుడిపై కాలు మోపింది. ఈ ప్రయోగంతో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిపై అధ్యయనానికి ‘ఆదిత్య ఎల్1’ సోలార్ మిషన్ ప్రారంభించింది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 అబ్జర్వేటరీని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనుంది.

ప్రయోగం ఎలా..? ఎంత దూరం ఆదిత్య ఎల్1 ప్రయాణం:

L1 Arbit

శ్రీహరికోట లోని షార్ నుంచి సెప్టెంబర్ 2, ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్1తో పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ముందుగా ఆదిత్య ఎల్1ను తక్కువ భూ కక్ష్యలో, దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచుతుంది. ఆ తరువాత ఆదిత్య ఎల్1లో అంతరిక్ష నౌకలో ఉండే ఆన్ బోర్డ్ ప్రొపల్షన్ ఇంజన్లు నౌకను సూర్యుడు, భూమికి మధ్య ఉండే లాంగ్రాజ్ పాయింట్(L1) వైపు తీసుకెళ్తుంది.

అంతరిక్ష నౌక L1 పాయింట్ వైపు వెళ్లే క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుంది. భూమి గురుత్వాకర్షణ స్పియర్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ నుంచి నిష్క్రమించిన తర్వాత నౌక క్రూయిజ్ దశ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే L1 చుట్టూ పెద్ద హాలో కక్ష్యలో అంతరిక్ష నౌక చేరుతుతుంది. భూమి నుంచి L1 పాయింట్ చేరుకునేందుకు ఆదిత్య అంతరిక్ష నౌకకు దాదాపుగా 4 నెలల సమయం పడుతుంది.

ఆదిత్య-L1 మిషన్ ప్రధాన లక్ష్యాలు:

Aditya L1

సూర్యుడి ఎగువ వాతావరణం( క్రోమోస్పియర్, కరోనా) అధ్యయనం. క్రోమోస్పియర్, కరోనల్ హీటింగ్, పాక్షికంగా ఆయనీకరణం చేయబడిన ప్లాస్మా భౌతిక శాస్త్రం, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సోలార్ ఫ్లేర్స్‌పై ఆదిత్య ఎల్ 1 అధ్యయనం చేస్తుంది.

సూర్యుడి పార్టికల్ డైనమిక్స్, ఇన్ సిటు పార్టికల్, ప్లాస్మా వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. సోలార్ కరోనా, కరోనల్ లూప్స్ డయాగ్నోస్టిక్స్, ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతపై అధ్యయనం.

కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) అభివృద్ధి, సౌర విస్పోటనానికి దారి తీస్తున్న పరిస్థితులను విశ్లేషిస్తుంది.

సోలార్ కరోనాలోని మాగ్నెటిక్ ఫీల్డ్ టోపాలాజీ, ఆయస్కాంత క్షేత్ర కొలతను అధ్యయనం చేస్తుంది. సోలార్ విండ్ అధ్యయనం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya-L1
  • Aditya-L1 solar mission
  • ISRO
  • PSLV
  • Sriharikota

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions