Chandrayaan-4: చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- చంద్రయాన్-4పై ఇస్రో కీలక అప్డేట్..
- 2028లో ప్రయోగం ఉంటుందని చెప్పిన ఇస్రో చైర్మన్..
- 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్..
- 2027లో మానవసహిత అంతరిక్ష యాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-4: చంద్రయాన్-4 అంతరిక్ష ప్రయోగంపై ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. భారత్ తన మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 2027లో ఉండనుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మరో 7 ప్రయోగాలను ఇస్రో ప్లాన్ చేసింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఇస్రో మరో ఏడు ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు. వీటిలో కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్లతో పాటు, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మిషన్లు ఉన్నాయని ఆయన చెప్పారు.
Read Also: Hyderabad: నగరంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ పంజా.. ఏకంగా రిటైర్డ్ కల్నల్ ఇంటికే కన్నం..
Also Read
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ -4 గురించి కీలక విషయాలను చెప్పారు. చంద్రుడి నమూనాలను సేకరించి భూమికి తిరిగి వచ్చే వ్యోమనౌకగా చంద్రయాన్-4 ప్రయోగం ఉండబోతోంది. ఇది ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రలో ఒకటిగా నిలువబోతోంది. దీంతో పాటు JAXA (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ)తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న మిషన్ LUPEX ద్వారా చంద్రుడి ధ్రువాల అన్వేషణ కార్యక్రమం కూడా ఉండబోతోంది. ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిన ధ్రువంలోని వాటర్ ఐస్‌ను అధ్యయనం చేయనున్నారు.
ఇస్రో ప్రయోగాలతో బిజీ అవుతున్న తరుణంలో తన వార్షిక అంతరిక్ష నౌకల ఉత్పత్తిని మూడు రెట్లు పెంచడానికి ప్రయత్నిస్తోంది. చంద్రయాన్ -4 చంద్రుడి ననుంచి నమూనాలనున భూమికి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనాలు మాత్రమే ఇలాంటి విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించాయి. అంతరిక్షంలో సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో భావిస్తోంది. దీనికి పని ప్రారంభించినట్లు నారాయణన్ చెప్పారు. ఐదు మాడ్యుళ్లతో ఈ కేంద్రాన్ని 2028లో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. దీనిని 2035 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాసా ఐఎస్ఎస్, చైనీస్ అంతరిక్ష సంస్థకు తియాంగాంగ్ వంటి సొంత అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్‌మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!