NTV Telugu Site icon

Asteroid: భూమికి పొంచి ఉన్న మరో ప్రమాదం.. అదే జరిగితే మానవ జాతి అంతం..!

Isro

Isro

Asteroid: ఖగోళ అద్భుతాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ గ్రహశకలాలు భూమి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు అందదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా అఫోసిస్‌ అనే గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. దీని పరిమాణం 370 మీటర్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అపోఫిస్ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న, మళ్లీ 2036లో మనల్ని దాటి వెళ్తుందని తెలిపారు. ఈ గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు 72 శాతం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని చెపుతున్నారు. అయితే గ్రహశకలాల నుండి భూమిని రక్షించడానికి.. గ్రహాల రక్షణ సామర్థ్యాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు పనిచేస్తున్నాయి.

Read Also: Mohammed Siraj: నేడు హైదరాబాద్‌లో మహమ్మద్‌ సిరాజ్‌ రోడ్ షో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. మన జీవితకాలం 70-80 ఏళ్లు.. ఇలాంటి విపత్తులను మన జీవితకాలంలో చూడలేం కాబట్టి ఇది సాధ్యం కాదని భావిస్తున్నాం. అయితే విశ్వం చరిత్రను పరిశీలిస్తే.. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు జరిగాయిని. బృహస్పతిని గ్రహశకలాలు ఢీ కొట్టాయని. భూమిపై అలాంటి సంఘటన ఏదైనా జరిగితే.. అందరూ అంతరించిపోతారని ఆయన తెలిపారు. అయితే ఈ అంచనాలు నిజం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని ఇస్రో చీఫ్ అంటున్నారు. భూమికి ఇలాంటి ముప్పు జరగకూడదని.. సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అంటున్నారు. అయితే దీనిని ఆపడం కష్టమని.. దీనికి ప్రత్యమ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉందని ఇస్రో చీఫ్ అంటున్నారు. భారత్‌ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్‌నాథ్‌ చెప్పారు

10 కి.మీ.ల వెడల్పాటి ఆస్టరాయిడ్‌ ఢీకొంటే వెలువడే ఉష్ణంధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదముందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్థానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి.