NTV Telugu Site icon

Aditya-L1: రేపే ఆదిత్య ఎల్1 లాంచ్.. చెంగాళమ్మ తల్లికి ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు

S Somanath

S Somanath

Aditya-L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 విజయం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి ‘ఆదిత్య ఎల్1’ మిషన్‌ని నిర్వహించనుంది. రేపు ఉదయం 11.50 గంటకలు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఆదిత్య ఎల్ 1 మిషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ శుక్రవారం సూళ్లురుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆలయాన్ని చేరుకున్న ఇస్రో చీఫ్ ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇస్రో ఏ ప్రతీ రాకెట్ లాంచ్ కు ముందు చెంగాళమ్మ తల్లి ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. 15 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.

Read Also: YSR Rythu Bharosa: ఒకేసారి రెండు శుభవార్తలు.. బటన్‌ నొక్కిన సీఎం జగన్‌.. వారి ఖాతాల్లో సొమ్ము జమ..

ఆదిత్య ఎల్ 1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని L1(లాంగ్రేజ్ పాయింట్) వద్దకు చేరుకుని హాలో కక్ష్యలో చేరుతుంది. ఇంత దూరం ప్రయాణించేందుకు స్పేస్ క్రాఫ్ట్ కి దాదాపుగా నాలుగు నెలలు(125 రోజులు) సమయం పడుతుంది. ఆదిత్య ఎల్1 మిషన్ తర్వాత రాబోయే రోజుల్లో SSLV – D3 మరియు PSLVలతో సహా అనేక ఇతర ప్రయోగాలను ఇస్రో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.