Site icon NTV Telugu

India-Maldives row: ఇండియా-మాల్దీవ్స్ వివాదం మధ్యలో “ఇజ్రాయిల్”.. లక్షద్వీప్‌ గురించి కీలక ప్రకటన..

Israel On Lashshadweep

Israel On Lashshadweep

India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్‌ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్‌ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్‌పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు.

Read Also: Gurugram: హాట్ కేకుల్లా లగ్జరీ హోమ్స్.. 3 రోజుల్లోనే 868 మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు విక్రయం..

ఇదిలా ఉంటే ఈ వివాదం నడుమ భారత మిత్ర దేశం ఇజ్రాయిల్ కీలక ప్రకటన చేయడం ఆసక్తి రేపింది. మంగళవారం ‘డిసాలినేషన్’(సముద్ర నీటిని మంచినీటిగా మార్చే విధానం) ప్రోగ్రాంని ప్రారంభించినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఎంబసీ సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించింది. ఇంతే కాకుండా లక్షద్వీపాలకు సంబంధించిన అందమైన బీచ్‌లకు ఫోటోలను పోస్ట్ చేస్తూ.. లక్షద్వీప్ అందాలని చూడని వారి కోసం మంత్రముగ్ధుల్ని చేసే కొన్ని చిత్రాలు ఉన్నాయంటూ కామెంట్ చేసింది.

మాల్దీవుల్లో ఏర్పడిన మహ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూల విధానాన్ని అవలంభిస్తూ, భారత వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. పూర్తిగా టూరిజంపై ఆధారపడిన ఈ ద్వీపదేశానికి భారత టూరిస్టులే ఆధారం. అయితే, పీఎం మోడీ లక్షద్వీపాలకు వెళ్లడంతో ఆ దేశం తన అక్కసును వెళ్లగక్కింది. ముగ్గురు మాల్దీవ్స్ మంత్రులు మోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. మాల్దీవ్స్ బదులుగా లక్షద్వీప్ వెళ్లాలని వారంతా సోషల్ మీడియాలో ‘‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’’ని ట్రెండ్ చేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గుగూల్‌లో లక్షద్వీప్ గురించి సెర్చ్ జరుగుతోంది. ఇక మేక్ మైట్రిప్ సైట్‌లో లక్షద్వీప్ కోసం సెర్చ్ 3400 శాతం పెరిగింది.

Exit mobile version