India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్‌ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్‌ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్‌పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు.