Site icon NTV Telugu

Israel Iran Conflict: టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు..

Israel Iran Conflict

Israel Iran Conflict

Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు కూడా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము ఇజ్రాయిల్ ఇరాన్ అణు కేంద్రాలను, కీలక శాస్త్రవేత్తలు, అధికారులను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం, ఇజ్రాయిల్ అతిపెద్ద నగరం టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. టెల్ అవీవ్‌తో పాటు రాజధాని జెరూసలెంలో కూడా పేలుళ్లు జరిగాయి. మరోవైపు, 24 గంటల్లోనే ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్‌పై భీకర దాడి చేసింది.

ఇజ్రాయిల్ పై దాడులకు ఇరాన్ ‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’’గా పేరు పెట్టింది. టెల్ అవీవ్‌పై జరిగిన తర్వాత ఒక వ్యక్తి మరణించగా, దాదాపుగా 34 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ “ఆపరేషన్ రైజింగ్ సన్” కింద ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది, ఇందులో కనీసం 78 మంది మరణించారు, 320 మందికి పైగా గాయపడ్డారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇళ్లు ధ్వంసం.. ఘాటుగా స్పందించిన భారత్..

ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే లక్ష్యంతో ఇజ్రాయెల్ శుక్రవారం అతిపెద్ద దాడిని ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్, ఇజ్రాయిల్ వైమానిక, క్షిపణి దాడులకు దిగాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్ కీలకమైన వైమానిక స్థావరమైన మెహ్రాబాద్ ఎయిర్ పోర్టుపై ఇజ్రాయిల్ ప్రొజెక్టై్ల్స్‌తో దాడి చేసింది. ఈ దాడితో ఎయిర్ పోర్టు మంటల్లో చిక్కుకుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూల్చేందుకు చర్యలు ఇప్పుడే ప్రారంభమైనట్లు ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇరాన్ ప్రజల్ని పేదరికంలో ముంచెత్తిన హంతక ఇస్లామిక్ పాలనపై దాడిగా అభివర్ణించారు. మరోవైపు, ఇజ్రాయిల్‌ని దారుణంగా దెబ్బతీస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.

ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సాయుధ దళాలకు చెందిన వ్యక్తులు, శాస్త్రవేత్తలు మరణించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మొహమ్మద్ బాఘేరి, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌కు నాయకత్వం వహించిన వ్యక్తి జనరల్ హోస్సేన్ సలామి, రివల్యూషనరీ గార్డ్‌ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాం అధిపతి జనరల్ అమీర్ అలీ హజీజాదే హతమయ్యారు.

Exit mobile version