Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ లోని అతిపెద్ద నగరమైన టెల్ అవీవ్‌ని ఇరాన్ క్షిపణులతో టార్గెట్ చేసింది. అయితే, ఇప్పుడు ఇజ్రాయిల్ పొరపాటున చేసిన పనికి భారతదేశానికి ‘‘క్షమాపణలు’’ చెప్పింది. భారతదేశ పటాన్ని ఇజ్రాయిల్ తప్పుగా చూపించింది. జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్‌లో భాగంగా, ఈశాన్య రాష్ట్రాలు నేపాల్‌లో భాగంగా చూపించింది.
Read Also: Iran-Israel War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. తాజా దాడుల్లో 78 మంది మృతి
ఇరాన్ క్షిపణుల పరిధిని వివరించే క్రమంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ భారతదేశ మ్యాప్‌ని తప్పుగా చూపించింది. ఐడిఎఫ్ శుక్రవారం మ్యాప్‌ను పోస్ట్ చేసింది, “ఇరాన్ ప్రపంచ ముప్పు, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు, ఇది ప్రారంభం మాత్రమే” అని పేర్కొంది. “మాకు చర్య తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు” అని అది సైనిక దాడిని ప్రస్తావిస్తూ జోడించింది. మ్యాప్‌లో భారతదేశాన్ని కూడా ఇరాన్ క్షిపణి పరిధిలో చేర్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక వివాదం మధ్య విడుదల చేసిన మ్యాప్‌పై భారతదేశం నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ఇజ్రాయిల్ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.
అయితే, ఈ తప్పుపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) క్షమాపణలు తెలిపింది. ఈ మ్యాప్ సరిహద్దులను ఖచ్చితంగా వర్ణించడంలో విఫలమైందని, ఈ చిత్రం వల్ల జరిగిన ఏదైనా నేరానికి మేము క్షమాపణలు కోరుతున్నాము అని చెప్పింది. ఇజ్రాయిల్ పోస్ట్ చేసిన మ్యాప్ ప్రకారం, భారత్, రష్యా, చైనా సహా 15 దేశాలు ఇరాన్ క్షిపణి పరిధిలోకి వస్తున్నాయి.
