NTV Telugu Site icon

PM Modi: “విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా.?” మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: కొన్ని పెద్ద కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరులో విదేశాల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, దేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా భారత గడ్డపై ఇలాంటి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కోరారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ప్రజలు భారతీయ ఉత్పత్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

‘‘ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 5 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. పెళ్లిళ్లకు షాపింగ్ చేసేటప్పుడు, మీరందరూ భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని ప్రధాని మోడీ అన్నారు. ‘‘పెళ్లిళ్ల టాపిక్ వచ్చినప్పుడు చాలా కాలంగా ఒక విషయం నన్ను కలవరపెడుతోంది. ఈ విషయాన్ని నేను నా కుటుంబసభ్యులతో కాకుంటే ఇంకెవరికి చెప్తాను. ఒక్కసారి ఆలోచించండి.. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే వాతారణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అవసరమా..? ’’ అని మోడీ అడిగారు.

Read Also: China Pneumonia: చైనాలో కొత్త వ్యాధి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

భారతగడ్డపై దేశంలోని ప్రజల మధ్య వివాహం జరుపుకుంటే, దేశంలోని డబ్బు దేశంలోని ఉంటుందని ప్రధాని అన్నారు. ఇలాంటి పెళ్లిళ్లలో దేశ ప్రజలకు ఏదో ఒక సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆయన సూచించారు. నిరుపేదలు కూడా మీ పెళ్లి గురించి తమ పిల్లలకు చెబుతారు. మీరు ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ సూచించారు. మీరు కోరుకునే వ్యవస్థ ఈరోజు ఉండకపోవచ్చు, కానీ మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే, వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందుతాయని, నా బాధ ఖచ్చితంగా పెద్దవారికి చేరుతుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

దేశ నిర్మాణ బాధ్యతలను ప్రజలు పెద్దగా తీసుకున్నప్పుడు, ఈ దేశాన్ని ముందుకు సాగకుండా ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల ప్రజలు అనేక మార్పులకు నాయకత్వం వహిస్తు్న్నారనేది నేడు భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. దీనికి పండగ సీజన్ ఒక ఉదాహరణ అని.. తగ కొద్ది రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. మన పిల్లలు షాపులో కొనుగోలు చేసేటప్పుడు మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉందా లేదా అని చూడాలని కోరారు. మీరు డిజిటల్ మాధ్యమం ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలని నిర్ణయించుకోవాలని, నగదు ద్వారా కాదని ప్రధాని ప్రజలను కోరారు.