Site icon NTV Telugu

Iron Rods In Rail Track: పంజాబ్‌లో తప్పిన ప్రమాదం.. రైలు పట్టాలపై ఇనుప రాడ్‌లు లభ్యం

Train

Train

Iron Rods In Rail Track: పంజాబ్‌లోని భటిండాలో ఈరోజు (సోమవారం) పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు కనిపించడంతో గూడ్స్ రైలు యొక్క లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో భటిండా- ఢిల్లీ రైల్వే ట్రాక్ గుండా ఒక గూడ్స్ రైలు వెళుతోంది.. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో ముందుగా గుర్తించి లోకో పైలెట్ వెంటనే ట్రైన్ ను ఆపేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నట్లు బటిండాలోని ప్రభుత్వ రైల్వే పోలీసు ఇన్వెస్టిగేటింగ్ అధికారి శవీందర్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 9 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Read Also: Mathematics In Pornsite: ఏం ప్లాన్ వేశావు గురూ.. పోర్న్‌‭సైట్స్‭లో గణిత బోధన.. కోట్ల రూపాయల సంపాదన

ఇక, సెప్టెంబర నెలలో గుర్తు తెలియని వ్యక్తులు రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించడం ఇది ఐదో ఘటనగా అధికారులు తెలిపారు. సెప్టెంబరు 22న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌లపై ఉంచిన ఎల్‌పీజీ సిలిండర్‌ను గుర్తించిన గూడ్స్ రైలు లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకొచ్చారు. అలాగే, ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 18 సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. రైల్వే ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్ దిమ్మలు వంటి వస్తువులు కనిపించాయని పేర్కొన్నారు.

Exit mobile version