Site icon NTV Telugu

Iran: భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం: ఇరాన్

Modi Iran

Modi Iran

Iran: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాక్‌కి వ్యతిరేకంగా దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జల ఒప్పందం’’ని రద్దు చేసింది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు పాక్‌కి వెళ్లకుండా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దాని ఉపనదులపై ఉన్న డ్యాముల గేట్లను క్లోజ్ చేసింది. మరోవైపు, పాకిస్తాన్ భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇందులో ‘‘సిమ్లా ఒప్పందం’’ కూడా ఉంది. భారతీయ విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసేసింది.

Read Also: Tulsi Gabbard: ‘‘ఉగ్ర వేటలో భారత్‌కి అమెరికా అండ’’.. యూఎస్ స్పై చీఫ్ తులసీ గబ్బర్డ్..

అయితే, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ముందుకొచ్చింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం ప్రాధాన్యతను నొక్కి చెబుతూ, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి భారత్, పాకిస్తాన్‌లను ‘‘పొరుగు సోదరులు’‘గా అభివర్ణించారు.

‘‘భారతదేశం మరియు పాకిస్తాన్ ఇరాన్ యొక్క సోదర పొరుగు దేశాలు, శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరిక సంబంధాలలో ముడిపడి ఉన్న సంబంధాలను ఆస్వాదిస్తున్నాయి. ఇతర పొరుగు దేశాల మాదిరిగానే, మేము వాటిని మా అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో ఎక్కువ అవగాహనను ఏర్పరచుకోవడానికి ఇస్లామాబాద్, న్యూఢిల్లీలోని తన మంచి కార్యాలయాలను ఉపయోగించుకోవడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉంది’’ అని అరఘ్చి ట్వీట్ చేశారు.

Exit mobile version