Iran Oil: భారీ డిస్కౌంట్‌తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- భారీ డిస్కౌంట్‌కు ఇరాన్ చమురు ఆఫర్..
- బ్యారెల్‌పై 3-4 డాలర్లు తగ్గింపు..
- అయినా భారత్ ఎందుకు కొనడం లేదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Oil: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసి, శాంతి వైపు అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 60 రోజలు పాటు ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని అమెరికా ఎత్తేసింది. దీంతో ఇరాన్ మళ్లీ చమురు మార్కెట్లోకి రావడానికి మార్గం ఏర్పడింది. హార్ముజ్ గుండా ఇరాన్ ఆయిల్ ప్రపంచ దేశాలకు చేరేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే, ఇరాన్ తమ చమురు కొనుగోలు చేసే బిగ్ ప్లేయర్ల కోసం చూస్తోంది. ముఖ్యంగా, భారత్‌పై ఇరాన్ ఆశలు పెంచుకుంది. భారత్ ఒప్పుకుంటే డిస్కౌంట్‌పై చమురు సరఫరా చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా భారత్‌కు తెలియజేసింది.
నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (NIOC) నేరుగా మరియు మధ్యవర్తుల ద్వారా భారతీయ రిఫైనరీలను సంప్రదించింది. ఇరాన్ తన ముడి చమురుపై బ్యారెల్‌కు 3-4 డాలర్లు చౌకగా ఇస్తామని భారత కొనుగోలుదారులకు చెబుతోందని రాయిటర్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఇరాన్ సంప్రదిస్తున్న వ్యాపారులు సింగపూర్, దుబాయ్‌లకు చెందిన చిన్న, మధ్య తరహా ట్రేడింగ్ కంపెనీలే అని ఆ నివేదిక వెల్లడించింది.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
అయితే, భారత్ ఆగస్టు వరకు తన చమురు సరఫరా దిగుమతుల్ని ముందే ఖరారు చేసుకుంది. దీంతో ఇరాన్ ఆయిల్‌ను ఇప్పటికిప్పుడు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. రాబోయే కాలంలో అన్ని పరిస్థితులు చక్కబడితే ఇరాన్ నుంచి భారత్ ముడి చమురు, ఎల్పీజీ దిగుమతుల్ని పెంచే అవకాశం ఉంది. భారత్ అనేక దేశాలతో చమురు ఒప్పందాలు చేసుకోవడంతో ఇప్పటికిప్పుడు ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు భారత్ వద్ద ఉన్న నిల్వలు కూడా నిండి ఉన్నాయి. దీంతో ఇరాన్ తక్కువ ధరకు ఇస్తామని చెబుతున్న భారత్ కొనలేని పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!