iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone Langar: ఐఫోన్ అంటే ఆసక్తి లేనిది ఎవరికి? అప్పు చేసైనా సరే.. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ ఐఫోన్‌ను పట్టాల్సిందే.. అనే తరహాలో ఐఫోన్ లవర్స్ ప్లాన్లు ఉంటాయి.. అయితే, మీరు ఐఫోన్ కొనలేకపోయారా? ఉచితంగా ఆ ఫోన్‌ను అందుకునే అవకాశం వచ్చింది.. ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్నా.. ధర కారణంగా వెనుకడుగు వేసేవారికి ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. చండీగఢ్‌లో సెప్టెంబర్ 22న ‘ఐఫోన్ లంగర్’ నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన వారికి ఐఫోన్లను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు..
ఈ పంపిణీ ప్రజలు, మీడియా సమక్షంలో ప్రత్యక్షంగా నిర్వహిస్తామని నిర్వాకులు ప్రకటించారు.. తొలుత చండీగఢ్, మొహాలీకి చెందిన వారిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. సుమారు 1,000 మందిని ప్రారంభ జాబితాలో పరిగణనలోకి తీసుకుని.. వారిలో అదృష్టవంతుల పేర్లను బహిరంగంగా డ్రా ద్వారా ఎంపిక చేసి ఐఫోన్లు అందజేస్తామని తెలిపారు. తొలి కార్యక్రమంలో 10 ఐఫోన్లు ఇవ్వనున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
ఐఫోన్ 17 మోడళ్లే..
మొదట ఐఫోన్ 16, ఐఫోన్ 17 మోడళ్లను పంపిణీ చేయాలని భావించినప్పటికీ.. చివరకు ఐఫోన్ 17, అంతకంటే పై మోడళ్లను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే అందుబాటును బట్టి మోడల్ ఉంటుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమాన్ని అనంతరం పంజాబ్‌లోని మరిన్ని నగరాలకు విస్తరించే యోచన ఉన్నట్లు సమాచారం. అయితే, గతంలో చండీగఢ్‌లో ‘పెట్రోల్ లంగర్’ నిర్వహణకు సంబంధించిన ప్రకటనతో వార్తల్లో నిలిచారు రాజా డీ కింగ్ అనే వ్యక్తి.. ఆ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలిరాగా, వర్షం కారణంగా పంపిణీ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు అదే తరహాలో ‘ఐఫోన్ లంగర్’ ప్రకటించడం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!