Site icon NTV Telugu

Inter-Caste Marriage: ఇంటర్ కాస్ట్ మ్యార్యేజ్ చేసుకుంటే….మరీ ఇంత దారుణమా…

Untitled Design

Untitled Design

ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటను దారుణంగా అమమానించారు ఓ గ్రామ పెద్దలు. అయితే ఎక్కువ వేరే కులం అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే.. హత్య చేయడమో.. లేక విడదీయడమో చేస్తూంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ జంటకు చెప్పుల దండ మెడలో వేసి రోడ్లపై ఊరేగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ ప్రేమ జంటను ఝార్ఖండ్ లోని ఓ గ్రామంలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. పైగా వారు గొప్ప పని చేసామని.. వారిని గ్రామంలో తిప్పుకుంటూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వారి దారుణంగా అమమానించారు. ముందుగా పంచాయితీ నిర్ణయం ప్రకారం వారికి పెళ్లి చేసి.. ఆ తర్వాత ఇద్దరి ముఖానికి నల్లటి రంగు పూసి.. చెప్పుల దండలు వేసి ఊరేగించారు. ఈ ఘటనను వీడియో తీసి ఎంజాయ్ చేస్తున్నారు..

Read Also: Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక అలసిపోయిన పోలీసులు

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వాళ్లు మనుషులా.. మృగాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇది ప్రేమ తిరుగుబాటు.. అవమానం కాదు గౌరవం.. ఇది ప్రేమికుల ఓటమి కాదు సమాజం వైఫల్యం’ అంటూ కుల, మత పిచ్చి గురించి ప్రస్తావించారు. ‘అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఎన్ని బంధాలనైనా ఒప్పుకుంటారు కానీ విశ్వసనీయ ప్రేమ మాత్రం శిక్షించబడుతుంది’, ‘సమాజం ప్రేమను తప్ప అన్నింటిని అంగీకరిస్తుంది.. ఇలాంటి వారిని జైలులో పెట్టాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version