NTV Telugu Site icon

హైఅలర్ట్‌: డోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్ర..! ఐబీ హెచ్చరికలు

drone attack

drone attack

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి… ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. తమకు సమాచారం చేరినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.. డ్రోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్రపన్నారని వెల్లడించిన ఇంటెలీజెన్స్‌ బ్యూరో… దేశ రాజధానిలో ‘ఆపరేషన్ జెహాద్’ ను ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. ఆగస్టు 15కు ముందే దాడులకు ప్రణాళికలు వేసినట్టు చెబుతున్నారు.. ఈ ఉగ్రదాడిని అడ్డుకోవడానికి అలర్ట్‌గా ఉండాలని పేర్కొంది… దీంతో.. భద్రతా బలగాలు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కాగా, భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పలు మార్లు డ్రోన్లు కలకలం సృష్టించగా… కొన్ని డ్రోన్లను ఇండియన్ ఆర్మీ పేల్చివేసింది.. ఇక, జమ్మూ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో ఉగ్రవాదులు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది.. ఇక, ఐబీ తాజా హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం అయ్యాయి భద్రతాబలగాలు.