దసరా రోజు ఎక్కడైనా రావణ దహనం చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే..చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తాం.. రావణ దహనం చేస్తాం. కానీ ఈ సారీ రావణ దహనం కాదు.. సూర్పనక దహనం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తాం.. రావణ దహనం చేస్తాం. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ ఏడాది రావణ దహన్‌కు బదులుగా ఆయన సోదరి సూర్పనఖ దహనం నిర్వహిస్తామని పౌరుష్ అనే పురుష హక్కుల సంస్థ ప్రకటించింది . అక్టోబర్ 2 దసరా రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. స్త్రీ దుష్టత్వానికి చిహ్నంగా సూర్పనఖ బొమ్మను దహనం చేస్తామని.. భర్తలను చంపిన భార్యల ఫొటోలను పదకొండు తలలుగా వినియోగిస్తామని తెలిపింది.
పౌరుష్ సంస్థ పది తలల రావణాసురుడి బొమ్మను దహనం చేసేందుకు బదులుగా.. భర్త, పిల్లలు, ప్రియుడిని హతమార్చిన మహిళల పదకొండు తలలను సూర్పనఖ బొమ్మ తలలుగా వినియోగించి దహనం చేస్తామని తెలిపింది. దుష్టత్వానికి లింగ భేదం లేదని చెప్పడమే తమ ఉద్దేశమని.. మహిళలు చేసిన నేరాలను ఖండించడమే లక్ష్యమని చెప్పింది. సమాజంలో నమ్మక ద్రోహం చేస్తున్న ఆధునిక సూర్పనఖలు ఎంతో మంది ఉన్నారని.. అందుకే ఈ సారి దసరా అధర్మ థీమ్‌ను ఇలా ప్లాన్ చేసినట్లు చెప్పింది. అయితే దీనిపై కొందరు సపోర్ట్ చేస్తుంటే ఇంకొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.