Site icon NTV Telugu

Indigo Flight Emergency Landing: బాంబు ఉందంటూ ప్రయాణికుడు హల్‌చల్‌.. తనిఖీ చేయగా..

Indigo

Indigo

విమానంలో ప్రయాణం చేయాలంటే చాలా మందికి భయం ఉంటుంది. విమానం సేఫ్‌ గా టేక్‌ ఆఫ్‌ కావడం మొదలు అంతే సేఫ్‌ గా ల్యాండ్‌ అయ్యే వరకు గుండెల్లో దడగానే వుంటుంది. ఎందుకంటే విమానం ఒక్కసారి గాల్లోకి ఎగిరిన తర్వాత ఏ విపత్తు వచ్చినా మన చేతుల్లో ఉండదు కాబట్టి. ప్రయాణ భయమో మరి ఎందుకో ఏమో తెలియదు కానీ ఓ ప్రయాణికుడు విమానం టేక్‌ ఆఫ్‌ అయిన తరువాత తన బ్యాగులో బాంబు ఉందంటూ హల్ చల్‌ చేసాడు. దీంతో ఆవిమానంలో తోటి ప్రయాణికుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి ఘటనే ఇండిగో ఫ్లైట్‌ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెలితే.. బిహార్‌ లోని పట్నా ఎయిర్​పోర్ట్​ నుంచి దిల్లీ వెళ్లే ఇండిగో 6e 2126 విమానంలో ఓ ప్రయాణికుడు హల్​చల్​ సృష్టించాడు. తన బ్యాగులో బాంబు ఉందని తోటి ప్రయాణికులందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు విమానాన్ని అత్యవసరంగా పట్నా విమానాశ్రయంలోనే నిలిపివేసి, వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేశారు అధికారులు. ఈవిషయం బాంబు స్క్వాడ్‌ నిపుణులు, పోలీసులకు తెలుపడంతో.. హుటాహుటిన విమానం వద్దకు చేరుకుని ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ప్రయాణికుడి బ్యాగులో ఎటువంటి బాంబు లేదని పోలీసులు గుర్తించారు. అయితే.. విమానంలో ప్రయాణిస్తుండగా బాంబు ఉన్నదని బెదిరించిన వ్యక్తిని రిశి చాంద్ సింగ్‌గా గుర్తించి, అతనిని అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆవ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు. కాగా.. పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. బాంబు బెదిరింపులు చేయగానే వెంటనే ఆ విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసి, గాలింపులు జరిపించామని.. ఆ విమానంలో బాంబు కనిపించలేదని తెలిపారు. ఇప్పటి వరకు విమానంలో ఏదీ కనిపించకున్నా, ప్రొటోకాల్ ప్రకారం గాలింపులు చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. ఈ విమానాన్ని రద్దు చేసి, రేపు ఉదయం ఈ విమానం మళ్లీ ప్రయాణం చేస్తుంది.

KL Rahul: అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు.. కరోనా ముద్దాడింది

Exit mobile version