Site icon NTV Telugu

IndiGo Crisis: కారణం అదేనట.. ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో కేంద్రమంత్రి సమాధానం..

Indigo Crisis

Indigo Crisis

IndiGo Crisis: పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో రాజ్యసభలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. FDTL ( Flight Duty Times Limitations) నిబంధనలను రూపొందించే ముందు అందరితో చర్చించామని తెలిపారు. ఇక, నవంబర్ 1వ తేదీ నుంచి రెండో దశ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చాం.. FDTL విధానం అమల్లోకి వచ్చిన నెల వరకు సజావుగానే విమాన సర్వీసులు నడిచాయి.. కానీ, డిసెంబర్ 3వ తేదీ నుంచే ఇండిగో సమస్య మొదలైంది అని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Read Also: Varanasi: ‘వారణాసి’ గ్లింప్స్‌పై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..!

అయితే, ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే భారీ మొత్తంలో విమాన సర్వీసులు రద్దు, ఆలస్యం జరిగాయని రాజ్యసభలో చెప్పుకొచ్చారు. ఇక, వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నాం.. ప్రయాణికుల అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను.. 5, 86, 700 విమాన టికెట్ రద్దు అయ్యాయి.. టికెట్ ధరలు పెంచకుండా మేము పరిమితులు విధించాం.. టిక్కెట్టు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. అయితే, ఇండిగో సంక్షోభంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జవాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.

Exit mobile version