CrowdStrike CEO: క్షమాపణలు చెప్పిన క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ..
- క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందన్న మైక్రోసాఫ్ట్
- వైఫల్యానికి క్షమాపణలు చెప్పిన క్రౌడ్‌స్ట్రైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కర్ట్జ్
- చాలా మంది కస్టమర్లు సిస్టమ్‌ను రీబూట్ చేశారని తెలిపిన జార్జ్
- సర్వర్ వాటంతటఅదే పునరుద్ధరించు కుంటోందని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్య కారణంగా చాలా ఐటీ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇలా చాలా సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొ్నాయి. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇంతలో.. క్రౌడ్‌స్ట్రైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కర్ట్జ్ ఈ సమస్య ఎందుకు తలెత్తింది.. దాన్ని పరిష్కరించడానికి ఏమి చేశారో సోషల్ మీడియా వేదికగా వివరించారు. “విండోస్ హోస్ట్‌ల కోసం సింగిల్ కంటెంట్ అప్‌డేట్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రభావితమైన కస్టమర్‌లతో క్రౌడ్‌స్ట్రైక్ చురుకుగా పనిచేస్తోంది. మ్యాక్ (Mac), లైనెక్స్ (Linux) హోస్ట్‌లు ప్రభావితం కావు. వాస్తవానికి ఇది సైబర్ దాడి కానే కాదు.. కేవలం ఒక బగ్ ఇష్యూ మాత్రమే..” అని స్పష్టం చేశారు. ఆ బగ్ సమస్యను గుర్తించాం.. దాన్ని సపరేట్ చేశాం.. ఇష్యూ ఫిక్స్ చేశాం.. లేటెస్ట్ అప్‌డేట్‌ల కోసం కస్టమర్‌లను సపోర్ట్ పోర్టల్‌ను విజిట్ చేయండి అని సూచించారు. లేదంటే తమ వెబ్‌సైట్‌లో ఫుల్ అప్‌డేట్స్ అందిస్తున్నామని స్పష్టం చేశారు.
READ MORE: RBI: మైక్రోసాఫ్ట్ సమస్యపై ఆర్‌బీఐ కీలక ప్రకటన
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
తాజాగా మరోసారి క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. బహుళ పరిశ్రమలకు అంతరాయం కలిగించిన గ్లోబల్ టెక్ వైఫల్యానికి క్షమాపణలు చెప్పారు. “మా కంపెనీతో సహా దీని ద్వారా ప్రభావితమైన వినియోగదారులు, ప్రయాణికులు మా వల్ల సమస్యలు ఎదుర్కున్నందుకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము” అని అతను ఎన్బీసీ న్యూస్ వేదికగా చెప్పారు. చాలా మంది కస్టమర్లు సిస్టమ్‌ను రీబూట్ చేస్తున్నారని.. ఇప్పులు సర్వర్ బాగానే పనిచేస్తున్నట్లు తెలిపారు. సర్వర్ వాటంతటఅదే పునరుద్ధరించుకుంటోందన్నారు. కొన్ని సిస్టమ్‌లకు ఇది కొంత సమయం కావచ్చని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..