India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్‌లో 5.2% శాతానికి
- ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు
- ఏప్రిల్‌లో 5.2% శాతానికి
- మార్చిలో ఈ రేటు 5.1 శాతంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో 15 ఏళ్లు పైబడిన వారి నిరుద్యోగ రేటు ఏప్రిల్‌లో 5.2 శాతానికి పెరిగింది. ఇది గత ఆరు నెలల్లో అత్యధిక స్థాయి. మార్చిలో ఈ రేటు 5.1 శాతంగా ఉంది. దీనికి ముందు అక్టోబర్ 2025లో అత్యధికంగా 5.2 శాతం నమోదైంది. Ministry of Statistics and Programme Implementation విడుదల చేసిన Periodic Labour Force Survey ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మార్చిలో 6.8% నుండి ఏప్రిల్‌లో 6.6%కి తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 4.3% నుండి 4.6%కి పెరిగింది. దేశవ్యాప్తంగా 374,243 మంది నుండి సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.
మహిళల నిరుద్యోగం
Also Read
- Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
- Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
- DA Hike : కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు
- Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా 'అర్నబ్' తుఫాను శాటిలైట్ ఫొటోలు..
మార్చిలో 5 శాతం ఉండగా, ఏప్రిల్‌లో అది 5.1 శాతానికి పెరిగింది. గ్రామీణ పురుషుల నిరుద్యోగం 4.4 శాతం నుంచి 4.7 శాతానికి పెరగగా, పట్టణ నిరుద్యోగం 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గింది. మహిళల నిరుద్యోగం మార్చిలో 5.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది.
గ్రామీణ మహిళల నిరుద్యోగం 4.4 శాతానికి పెరగగా, పట్టణ మహిళల నిరుద్యోగం 8.5 శాతానికి తగ్గింది. గత ఏడాది ఏప్రిల్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి. మహిళల భాగస్వామ్య నిష్పత్తి ( డబ్ల్యూపీఆర్), అంటే పనిచేసే జనాభా నిష్పత్తి, మార్చిలోని 52.6 శాతం నుంచి ఏప్రిల్‌లో 52.2 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 46.8 శాతం వద్ద స్థిరంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 54.9 శాతానికి తగ్గింది.
కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పిఆర్) మార్చిలో 55.4 శాతం నుండి ఏప్రిల్‌లో 55 శాతానికి తగ్గింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 57.5 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 50.1 శాతంగా నమోదైంది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు మార్చిలో 34.4 శాతం నుండి ఏప్రిల్ 2026 నాటికి 33.9 శాతానికి తగ్గింది. గ్రామీణ మహిళల ఎల్ఎఫ్పిఆర్ 38.2 శాతంగా, పట్టణ మహిళలది 25 శాతంగా ఉంది.
తాజావార్తలు
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
-
Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
-
Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
-
DA Hike : కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!