NTV Telugu Site icon

S Jaishankar: అది జైశంకర్ అంటే.. పాకిస్తాన్ మంత్రి ముందే ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్..

Jai Shankar

Jai Shankar

S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల్లో భాగంగా ఈ రోజు గోవా వేదికగా ఎస్‌సిఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (సిఎఫ్‌ఎం) జరిగింది. ఈ సమావేశానికి సభ్యదేశాలు అయిన పాకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల విదేశాంగమంత్రలు హాజరయ్యారు. పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా సమావేశాలకు హాజరయ్యారు. బిలావల్ ను స్వాగతించిన కొద్ది సేపటికే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.

Read Also: DK Shivakumar: శివకుమార్ నీకే ఎందుకిలా..? “భజరంగబలి”కి కోపం వచ్చిందా..?

ప్రపంచం కోవిడ్, దాని పర్యవసనాలను ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉందని, మరో వైపు ఉగ్రవాద ముప్పు నిరాటంకంగా కొనసాగుతుందని జైశంకర్ అన్నారు. ఉగ్రవాదం దేశాల భద్రతాప్రయోజనాలకు హాని కలిగిస్తోందని అన్నారు. ఉగ్రవాదానికి ఎలాంటి సపోర్ట్ ఉండవద్దని సభ్యదేశాలను ఉద్దేశిస్తూ..ముఖ్యంగా భారత్ లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్, దానికి వంతపాడుతున్న చైనాలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి ఆర్థిక సహాయాన్ని నిలిపేయాలని పిలుపునిచ్చారు. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు మా దృష్టిలో ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నాడు, ఆఫ్ఘన్ ప్రజల సంక్షేమం వైపు మళ్లించాలని అన్నారు.

కోవిడ్-19 మహమ్మారి, రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ప్రపంచంలో సప్లై చైన్ దెబ్బతిన్నదని, ఇంధనం, ఆహారం, ఎరువులపై తీవ్ర ప్రభావం పడిందని జైశంకర్ అన్నారు. ఈ సవాళ్లను ఎస్‌సిఓ సభ్యదేశాలు సమిష్టిగా పరిష్కరించడానికి ఒక అవకాశం ఏర్పడిందని అన్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా ఎస్ సీ ఓ సభ్యదేశాల్లోనే ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు.