NTV Telugu Site icon

Tariff Cuts: అమెరికా టారిఫ్ వార్.. భారత్ సంచలన వ్యాఖ్యలు..

Tariff Cuts

Tariff Cuts

Tariff Cuts: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ‘‘పరస్పర సుంకాలు’’, సుంకాల పెంపుపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించారు. ఇండియాపై కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పారు. అయితే, ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తన సుంకాలను చాలా వరకు తగ్గించుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజలు తర్వాత, అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించడానికి కట్టుబడి లేమని భారత్ చెబుతోంది.

అమెరికాతో అనేక దేశాలు అన్యాయమైన పద్ధతులు పాటిస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. భారత్‌తో సహా అనేక దేశాలకు పరస్పర సుంకాలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. గత వారం మరోసారి ట్రంప్ భారత్ భారీ సుంకాలను విమర్శించారు. ‘‘మీరు భారత్‌లో ఏదీ అమ్మలేదు, అమెరికా ఉత్పత్తుల అమ్మకాలు దాదాపుగా పరిమితం చేయబడ్డాయి.’’ అన్నారు. కానీ వారు ఇప్పుడు సుంకాలు తగ్గించుకోవాలని కోరుకుంటున్నారని, ఎందుకంటే వారు ఇన్నాళ్లు చేసింది బహిర్గమైందని ట్రంప్ అన్నారు.

Read Also: Shekar Master : బూతు స్టెప్పులకు బ్రాండ్ అంబాసిడర్ గా శేఖర్ మాస్టర్ ?

అయితే, భారత ప్రభుత్వం పార్లమెంటరీ ప్యానెల్‌కి ‘‘ఈ అంశంపై అమెరికాకు ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదని’’ జాతీయ మీడియా ఒక నివేదికలో తెలిపింది. అమెరికన్ అధ్యక్షుడు పదే పదే లేవనెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడానికి సెప్టెంబర్ వరకు సమయం కోరినట్లు చెప్పింది.

భారతదేశం , యుఎస్ పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం పనిచేస్తున్నాయని, తక్షణ సుంకాల సర్దుబాట్లను కోరుతూ కాకుండా దీర్ఘకాలిక వాణిజ్య సహకారంపై దృష్టి సారించాయని” భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మధ్య త్వరలో కుదిరే పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై పనిచస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గత నెలలో వైట్‌ హౌజ్‌లో ట్రంప్‌తో మోడీ భేటీ అయ్యారు.