Site icon NTV Telugu

India-Canada Row: మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కిన కెనడా.. దౌత్యవేత్తలపై నిఘా పెట్టినట్లు వెల్లడి

Canada

Canada

India-Canada Row: భారత్‌తో దౌత్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటున్నా కూడా కెనడా వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాటల్నే విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. కెనడాలో ఉన్న మిగిలిన దౌత్యవేత్తలపై తాము ప్రత్యేక నిఘా ఉంచామంటూ భారత్‌పై బురద జల్లే ప్రక్రియను ఆమె కొనసాగించారు. అంతటితో ఆగకుండా భారత్‌ను రష్యాతో పోలుస్తూ అక్కసును వెళ్లగక్కింది. భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్‌ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని మెలానీ జోలీ కామెంట్స్ చేసింది.

Read Also: Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. వరుసగా నాలుగోరోజు పెరిగిన బంగారం ధరలు!

ఇంకా మెలానీ జోలీ మాట్లాడుతూ.. కెనడా దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. మన దేశ గడ్డపై విదేశీ అణచివేత జరగదు అని తేల్చి చెప్పారు. ఐరోపాలో ఇలాంటి ఘటనలు చూశాం.. జర్మనీ , బ్రిటన్‌లో రష్యా విదేశీ జోక్యానికి పాల్పడింది అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నామని వెల్లడించారు. కాగా, హర్థీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును కెనడా సర్కార్ చేర్చింది. అతడ్ని విచారించాల్సి ఉందని భారత విదేశాంగ శాఖకు కెనడా మెసేజ్ చేసింది. ఇక, దీనిపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది.

Exit mobile version