Global Gender: లింగ సమానత్వంలో భారత్ స్థానం మెరుగుపడింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 8 స్థానాలు మెరుగుపడింది. గత ఏడాదిలో ప్రపంచ సూచీలో 135వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది అది కాస్త 127వ స్థానంలోకి వచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)-2023 ఏడాదికి గాను 146 దేశాలకు సంబంధించిన లింగ సమానత్వ సూచీలను ప్రకటించింది.
Read also: Miss Shetty Mister Polishetty : సినిమాలో అనుష్క తో రొమాంటిక్ సీన్స్ లో నటించబోతున్న నవీన్..?
విద్యలో అన్ని స్థాయిల్లో ప్రవేశాలకు సంబంధించి భారత్ లింగ సమానత్వం సాధించిందని నివేదిక తెలిపింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారత్ 64.3 వాతం ముందంజ వేసినా.. స్త్రీ, పురుష ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7 శాతం సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది. 148 దేశాల లింగ సమానత్వ సూచీలో ఐస్‌ల్యాండ్ వరుసగా 14 ఏళ్ల నుంచి అగ్రస్థానాన్ని నిలుపుకుంటూ వస్తోంది. ఈ సూచీలో పొరుగుదేశం బంగ్లాదేశ్ 59వ స్థానంతో ఎంతో మెరుగైన ఫలితాన్ని సాధించింది. సూచీలో భూటాన్‌ది 103వ స్థానం కాగా చైనా 107, శ్రీలంక 115, నేపాల్ 116, పాకిస్థాన్ 142వ ర్యాంకుల్లో నిలిచాయి.
Read also: Revanth Reddy: కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు
భారతీయ మహిళలు ఆదాయం, వేతనాల పరంగా నిరుటికన్నా మెరుగైన స్థితిలో ఉన్నా.. సీనియర్ పదవుల్లో, సాంకేతిక ఉద్యోగాల్లో కాస్త వెనుకబడ్డారని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం 15.1 శాతానికి చేరింది. 2006లో లింగసమానత్వ సూచీని ప్రకటిస్తున్నప్పటి నుంచి భారత్‌కు ఇదే అత్యధిక మహిళా ప్రాతినిధ్య రేటు. స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం 44.4 శాతానికి చేరింది. జనన సమయంలో లింగ నిష్పత్తి 1.9 శాతం మెరుగుపడింది. ఆడశిశువు జననాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని నివేదిక తెలిపింది. భారత్, చైనా, తుర్కియే దేశాల మంత్రి పదవుల్లో మహిళల వాటా 7 శాతం కన్నా తక్కువగా ఉంది. విద్య విషయంలో పురోగతి వల్ల 2023లో ప్రపంచ లింగ సమానత్వ సూచీ కొంత మెరుగుపడింది. పరిస్థితి ఇలానే ఉంటే ఆర్థిక లింగ సమానత్వ సాధనకు 169 ఏళ్లు, రాజకీయ సమానత్వానికి 162 ఏళ్లు పడుతుందని నివేదిక తెలిపింది. పరిస్థితి కొవిడ్ ముందునాటి కన్నా మెరుగుపడినా జీవన వ్యయం పెరుగుదల, కార్మిక విపణిలో సంక్షోభం మహిళలను ఎక్కువగా పీడిస్తోందని నివేదికలో బయటపడింది.
