Canada: కెనడా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.. ట్రూడో తీరుపై భారత్ ఆగ్రహం..
- కెనడా తీరుపై భారత్ ఆగ్రహం..
- ట్రూడోని బెదిరించిన వ్యక్తుల అరెస్ట్..
- భారతీయ నేతలను బెదిరిస్తున్న వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: భారత వ్యతిరేక, ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా మెతక వైఖరి అవలంభిస్తోంది. పలుమార్లు ఈ విషయాన్ని భారత్, కెనడా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పలు సందర్భాల్లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పోస్టర్ల అంటించడంతో పాటు కెనడాలోని పలు ప్రాంతాల్లో ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎలాంటి భయం లేకుండా కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఇటీవల ఆన్లైన్లో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని అక్కడి ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసింది. అయితే, దీనిని కెనడా ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’అని భారత్ ఆరోపించింది. గురువారం మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. భారతీయ నాయకులు, దౌత్యవేత్తలను పదేపదే బెదిరించే భారత వ్యతిరేక శక్తులపై కెనడా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో అలసత్వం వహిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Health Tips: సకాలంలో గర్భం దాల్చలేకపోతే ఈ వ్యాధులు చెక్ చేసుకోండి
“ప్రజాస్వామ్యం చట్టం యొక్క పాలన మరియు భావప్రకటనా స్వేచ్ఛను కొలవడానికి లేదా అమలు చేయడానికి వివిధ ప్రమాణాలను అవలంబించినప్పుడు, అది దాని స్వంత ద్వంద్వ ప్రమాణాన్ని మాత్రమే బహిర్గతం చేస్తుంది” అని జైశ్వాల్ అన్నారు. ఇటీవల ట్రూడోని బెదిరించిన వారిని అరెస్ట్ చేసిన విధంగానే, భారతీయ నాయకులను బెదిరిస్తున్న వారిపై అలాంటి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
ఇటీవల ట్రూడో, ఇతర కెనడియన్ రాజకీయ నాయకులపై అల్బెర్టాకి చెందిన ఇద్దరు ఆన్లైన్లో బెదిరించారు. వీరిద్దరిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. జూన్ 6న ఎక్స్‌లో ట్రూడోని చంపుతామని బెదిరించారు. ట్రూడోతో పాటు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, న్యూడెమోక్రటిక్ పార్టీ నేత, ఎంపీ జగ్మీత్ సింగ్‌లకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ గతేడాది సర్రేలో హత్యకు గురైనప్పటి నుంచి కెనడా-భారత్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని, కెనడా చేసిన వ్యాఖ్యలు అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను విమర్శించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!