NTV Telugu Site icon

Tensions in Middle East: ఇజ్రాయిల్‌లో ఉండే భారతీయులు జాగ్రత్త.. ఎంబసీ ఆదేశాలు..

Indian Embussy

Indian Embussy

Tensions in Middle East: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఎగిశాయి. ఈ హత్యకు ఇజ్రాయిల్ కారణమని ఇరాన్‌, హమాస్ ఆరోపిస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఇజ్రాయిల్ స్పందించలేదు. ఈ హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.

Read Also: Miss Universe India: మిస్ యూనివర్స్- ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతికి ఏపీ సీఎం అభినందన

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం సూచించింది. స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రోటోకాల్‌కి కట్టుబడాలని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఎంబసీ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది మరియు మా జాతీయులందరి భద్రతను నిర్ధారించడానికి ఇజ్రాయెల్ అధికారులతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉంటుందని పేర్కొంది.

భారత రాయబార కార్యాలయం ఇండియన్స్ కోసం రెండు సంప్రదింపు నంబర్‌లను  +972-547520711 మరియు +972-543278392 మరియు ఒక ఇమెయిల్ ID — cons1.telaviv@mea.gov.in–ని కూడా షేర్ చేసింది. ఇప్పటికే పరిస్థితులు గంభీరంగా ఉండటంతో టెల్ అవీవ్‌కి వెళ్లే అన్ని విమానాలను ఎయిర్ ఇండియా ఆగస్టు 8 వరకు రద్దు చేసింది. ఇరాన్‌లో ఇస్మాయిల్ హనియే హత్య కావడంతో పాటు లెబనాన్ బీరూట్‌లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఇజ్రాయిల్ హతమార్చడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.