NTV Telugu Site icon

Cancer: క్యాన్సర్ కణాలను చంపే కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు

Cancer Cells

Cancer Cells

Cancer: శాస్త్రసాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు. ముందు దశల్లో గుర్తిస్తే కీమో థెరపీ, ఇతర విధానాలతో వ్యాధిని నయం చేస్తున్నారు వైద్యులు. అయితే క్యాన్సర్ చివరి దశల్లో మాత్రం రోగి ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణకు దొరకడం లేదు. ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధి పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందు అడుగు వేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూర్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలను గుర్తించి, చంపే కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు.

గోల్డ్, కాపర్ సల్పైడ్ తో కూడిన హైడ్రో నానోపార్టికల్స్‌ని రూపొందించి, ఇవి వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవని, ధ్వని తరంగాలను ఉపయోగించి వాటిని గుర్తించగలవని సైంటిస్టులు చెబుతున్నారు. ACS అప్లైడ్ నానో మెటీరియల్స్‌‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ఈ కొత్త విధానం గురించి వివరించింది.

Read Also: Justin Trudeau: పాడైపోయిన డొక్కు విమానం.. ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని

ఈ హైబ్రీడ్ నానోపార్టికల్స్ ఫోటో థర్మర్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటి ఫోటో కాస్టిక్ లక్షణాలను ప్రదర్శిస్తాయి. కాంతికి గురైనప్పుడు ఈ పార్టికల్స్ దాన్ని గ్రహించి ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. దీతో క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా చంపేయవచ్చు. ఇంతే కాకుండా విషపూరిత సింగిల్ట్ ఆక్సిజన్ అణువులను ఉత్పత్తి చేసి క్యాన్సర్ కణాల నాశనానికి మరింతగా ఉపయోగపడుతాయి. ఇదిలా ఉంటే ఈ నానోపార్టికల్స్ కాంతిని గ్రహించి ఆల్ట్రాసౌండ్ వేవ్స్ ని ఉత్పత్తి చేయగలవు. దీంతో రోగనిర్థారణ చేయవచ్చు. క్యాన్సర్ కణాలను గుర్తించగలదు.

కణజాలాల గుండా వెళ్తున్నప్పుడు ధ్వని తరంగాలు కాంతి కంటే తక్కువగా వెదజల్లుతాయి. స్పష్టమైన చిత్రాలను, క్యాన్సర్ కణితుల్లోని ఆక్సిజన్ సాచురేషన్ ఖచ్చితమైన మెజర్మెంట్స్ ని అందించడం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించడం ద్వారా, కాపర్ సల్పైడ్ ఉపరితలంపై చిన్నచిన్న గోల్డ్ సీడ్స్ ని జమచేయగలిగారు. 8 nm కంటే తక్కువ పరిమాణంలో హైబ్రిడ్ నానోపార్టికల్స్‌ను సృష్టించారు. ఈ సూక్ష్మ పార్టికల్స్ కణజాలాలు నుేంచి సులభంగా కణితులను చేరుకోగలవు. అదే సమయంలో మానవ శరీరంలో పేరుకుపోకుండా, బయటకు వెళ్లేంత చిన్నవిగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ నానోపార్టికల్స్ ని ప్రయోగశాలలో ఉపిరితిత్తులు, గర్భాశయ క్యాన్సర్ కణ తంతువులపై పరీక్షించబడ్డాయి. ముందుముందు మరిన్ని ఆశాజనక ఫలితాాలు వస్తాయని ఐఐఎస్‌సీ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

Show comments