India: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆయా అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చినప్పటికీ.. దీన్ని ఓ సాకుగా చూపిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాపై 25 శాతం సుంకంతో పాటు పెనాల్టీలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారతీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్త కథనాలు వస్తున్నాయి.
అయితే, భారత్‌కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ లాంటి సంస్థలు గత వారం రోజులుగా రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం లేదని వార్తలు వచ్చాయి. రిఫైనరీ సంస్థలకు చెందిన అత్యంత నమ్మదగిన సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఆయా సంస్థలు పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదని తెలియజేశారని జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తుంది.
Read Also: Harsh Goenka: T20లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడా?.. పాక్ చమురుపై ట్రంప్పై గొయెంకా సెటైర్లు
ఇక, ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద చమురు దిగుమతిదారుగా కొనసాగుతుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ సవాళ్లను దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు ముడి చమురును కొనుగోలు చేస్తోంది. భారత్‌కు వస్తున్న మొత్తం ఇంధన సరఫరాలో దాదాపు 35 శాతం రష్యా చమురే. కానీ, దీనిపై అమెరికా సహా పలు పశ్చిమదేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కొంటున్న చమురుతోనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మాస్కో కొనసాగిస్తుందని ఆరోపిస్తున్నాయి.
