Site icon NTV Telugu

Meta:కెనడాలో ఐఐటీ గ్రాడ్యుయేట్‌ తిప్పలు.. రెండురోజుల్లోనే జాబ్ తీసేసిన మెటా

Meta Lay Offs

Meta Lay Offs

Indian Man Relocates To Canada For Meta Job, Laid-Off Just 2 Days Later: ఉద్యోగం కోసం కోటి ఆశలతో ఇండియా నుంచి కెనడాకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యగికి ఊహించని షాక్ తగిలింది. కెనడాకు వెళ్లిన రెండు రోజుల్లోనే ఉద్యోగం నుంచి తీసేసింది ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ యూనివర్సిటీ చదివిన విద్యార్థినే తీసి పక్కన పడేసింది. భారత దేశం నుంచి వెళ్లిన రెండు రోజులకే తనను ఉద్యోగం నుంచి తీసేయడంపై వీ హిమాన్షు అనే ఉద్యోగి భావోద్వేగానికి గురయ్యాడు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన హిమాన్షు గతంలో అడోబ్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశాడు.

Read Also: IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?

తన పరిస్థితిని వివరిస్తూ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఇలా రాశాడు..‘‘ నేను మెటాలో చేరడానికి కెనడాకు మకాం మార్చాను. అక్కడ విధుల్లో చేరిన రెండు రోజుల్లోనే భారీ తొలగింపుల కారణంగా ఉద్యోగం పోయింది. ప్రస్తుతం క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న నాలాంటి వాళ్లను చూస్తే బాధగా ఉందని, తన తదుపరి ప్రయాణం గురించి తనకు తెలియదని.. ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఉద్యోగం ఉంటే తెలియజేయాలి’’ అని కోరాడు. ఇండియాలో లేదా కెనడాలో ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఉద్యోగం ఉంటే తెలియజేయాలని పోస్ట్ లో కోరాడు.

హిమాన్షు పరిస్థితిపై పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. చాలా మంది అతడిని ఓదార్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లను నియమించుకునే కంపెనీల లింక్‌లను పంచుకున్నారు. రెండు రోజుల తర్వాత తొలగించేందుకు ఉద్యోగులు ఖండాంతరాలు దాటేలా కంపెనీలు చేస్తున్నాయని మరొకరు కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే ఆదాయాలు తగ్గడంతో పాటు ఆర్థికమాంద్యం భయాల కారణంగా మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. 13 శాతం మందిని తగ్గించుకుంటున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు 16 వారాల బేస్ సాలరీతో పాటు ప్రతీ ఏడాది సర్వీసుకు మరో రెండు వారాలు అదనంగా ఉద్యోగులకు చెల్లిస్తామని మెటా వెల్లడిాంచింది.

Exit mobile version