Site icon NTV Telugu

EzriCare Eye Drops: ఇండియన్ కంపెనీకి చెందిన ఐడ్రాప్స్‌తో అమెరికాలో ఒకరి మరణం.. రీకాల్ చేసిన కంపెనీ

Eye Drops

Eye Drops

Indian Firm Suspends Production Of Eye Drops Linked To Death In US: భారతదేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరు మరణించారు. పలువురికి కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎజ్రీకేర్ వల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55 మంది వరకు దీని వల్ల ప్రభావితం అయ్యారు. ఇందులో ఒకరు మరణించగా.. ఐదుగురు కంటి చూపును కోల్పోయినట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అధికారులు వెల్లడించారు. ఈ మందును నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: Indra Karan Reddy : మహారాష్ట్రలో ఇకపై అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది

ఈ మందును వాడిన తర్వాత రక్తం, మూత్రం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కనిపించినట్లు సీడీసీ వెల్లడించింది. ఈ మందులను వాడటాన్ని నిలిపివేయాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆదేశాలు జారీ చేసింది. సూడోమోనాస్ ఎరుగినోసా అనే బ్యాక్టీరియా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ గా మారిందని.. దీని వల్లే ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అప్రమత్తం అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), స్టేట్ డ్రగ్ కంట్రోలర్‌ల బృందాలు విచారణ కోసం చెన్నైకి దక్షిణాన 40 కి.మీ దూరంలో ఉన్న గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ప్లాంట్‌కు వెళ్తున్నాయి.

ఇప్పటికే భారత్ లో తయారైన దగ్గు మందు కారణంగా ఇటీవల గాంబియా, ఉజ్బెకిస్థాన్‌ దేశాల్లో పదుల సంఖ్యలో పిల్లలు మరణించారు. తాజాగా ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో మరణం, కంటిచూపు సమస్యలు ఏర్పడ్డాయి.

Exit mobile version