California: కాలిఫోర్నియాలో పిల్లలతో సహా భారతీయ కుటుంబం మృతి.. హత్య-ఆత్మహత్యగా పోలీసుల అనునమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
California: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం చోటు చేసుకుంది. భారతీయ దంపతులు, తమ ఇద్దరు పిల్లలతో కలిసి మరణించారు. 2 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిలో విగతజీవులుగా కనిపించారు. మరణించిన వ్యక్తుల్ని ఆనంద్ సుజిత్ హెన్రీ, 42, అతని భార్య అలిస్ ప్రియాంక, 40, మరియు వారి 4 సంవత్సరాల కవల పిల్లలు నోహ్ మరియు నీతాన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనను హత్య-ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వ్యక్తులపై తుపాకీ గాయాలు కనిపించాయి.
Also Read
- Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
ఇంట్లో ఎవరూ ఫోన్ తీయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారతీయ-అమెరికన్ జంట ఆనంద్, ఆలిస్ బాత్రూమ్లో తుపాకీ గాయాలతో చనిపోయారు. కవల పిల్లలు బెడ్రూమ్లో మరణించి ఉన్నట్లు గుర్తించారు. వారి మరణానికి ఇంకా స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. ఇంట్లోకి ఎవరూ కూడా బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు కనిపించలేదని, తాము కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత నలుగురు మరణించి ఉన్నట్లు కనుగొన్నామని పోలీసులు వెల్లడించారు. బాత్రూమ్లో 9 ఎంఎం పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ జంట 2020లో 2.1 మిలియన్ డాలర్లతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. కేరళకు చెందిన ఈ కుటుంబం గత 9 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆనంద్, సీనియర్ అనలిస్ట్ అయిన ఆలిస్ రెండేళ్ల క్రితం న్యూజెర్సీ నుంచి శాన్ మాటియో కౌంటీకి మకాం మార్చారు. 2016 డిసెంబర్లో ఆనంద్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు రికార్డులు సూచిస్తున్నాయి, అయితే విచారణ పూర్తి కాలేదు.
తాజావార్తలు
-
Tollywood: మళ్లీ ట్రెండ్‌లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!