Site icon NTV Telugu

Daredevils: కర్తవ్యపథ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ డేర్‌డెవిల్స్‌

Army

Army

Daredevils: ఇండియన్ ఆర్మీకి చెందిన కదిలే మోటార్‌ బైక్‌లపై హ్యూమన్‌ పిరమిడ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో డేర్‌డెవిల్స్‌ ఈ అసాధారణ ఘనతను నెలకొల్పింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్‌లో మొత్తం 40 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇందులో 7 మోటార్‌ వెహికిల్స్ పై నిలబడి కర్తవ్యపథ్‌లోని విజయ్‌చౌక్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు 2 కిలోమీటర్ల మేర ఈ రైడ్ జరిగింది. వీరిలో సిగ్నల్స్ కార్ప్స్ ఆర్మ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ కేవీ కుమార్ కూడా పాల్గొన్నారు. తాజా ఫీట్‌తో డేర్‌డెవిల్స్‌.. గిన్నిస్‌ బుక్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇలా 33 వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది.

Read Also: Danush, Surya: ధ‌నుష్‌,సూర్య కాంబోలో వెంకీ అట్లూరీ పాన్ ఇండియా మూవీ ?

అయితే, 1935లో డేర్‌డెవిల్స్‌ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,600సార్లు మోటార్‌ సైకిళ్లపై ప్రదర్శనలు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌, ఆర్మీ డే పరేడ్‌లు లాంటి వివిధ మిలిటరీకి సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో వీక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రదర్శన చేస్తుంటారు.

Exit mobile version