NTV Telugu Site icon

Rajnath Singh: అలసత్వం వద్దు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముంది..

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: దేశ సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అందువల్లే సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో అజాగ్రత్త పనికి రాదు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు (శనివారం) విజయ దశమిని పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో గల సుక్నా కాంట్‌ను ఆయన సందర్శించారు. ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ చేసిన తర్వాత వారినుద్దేశించి ప్రసంగం చేశారు. సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా విధులు నిర్వర్తిస్తుందన్నారు. దేశ భద్రత విషయంలో మనం దృఢంగా నిలబడాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

Read Also: Fertility Boosting Fruits: స్త్రీ, పురుషులకు ఉపయోగకరమైన పండ్లు.. ఇవి తింటే..

ఇక, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయ దశమి జరుపుకుంటామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మనం సొంతంగా ఏ దేశంపైనా దాడి చేయడం లేదు.. ఎవరితోనూ మనకు శత్రుత్వం లేదు.. కానీ ఏ దేశమైనా మన సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసినప్పుడు మనం వారితో పోరాడక తప్పదని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు మన సైనికులు సిద్ధంగా ఉండాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచనలు చేశారు.

Show comments