IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- జూలై 15 నుంచి భారత్-యూకే FTA అమల్లోకి.
- డిఫెండర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లపై దిగుమతి సుంకం భారీగా తగ్గింపు.
- స్కాచ్ విస్కీపై సుంకం 150% నుంచి దశలవారీగా 40%కు.
- యూకేలో భారతీయ వస్తువుల 99%పై సున్నా సుంకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND-UK FTA: యునైటెడ్ కింగ్డమ్(యూకే)-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూలై 15న అమలులోకి వస్తోంది. భారత్‌లోకి వచ్చే బ్రిటిష్ వస్తువులపై గణనీయంగా ధరలు తగ్గబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు, విస్కీ, ఇతర ఉత్పత్తులపై ధరలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా కార్ల ధరలు 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే ల్యాండ్ రోవర్, జాగ్వార్, రోల్స్ రాయిస్ , ఆస్టన్ మార్టిన్ వంటి కార్లు చౌక ధరలకే లభిస్తాయి.
చౌకగా కార్లు:
భారత్-యూకే వాణిజ్య ఒప్పందం ప్రకారం.. రెండు దేశాల మధ్య చాలా వస్తువులపై సున్నా లేదా తగ్గించిన సుంకాలు అమలులోకి వస్తాయి. నోటిఫికేషన్ ప్రకారం, మొదటి ఏడాది 20,000 కార్లను తగ్గించిన సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. 3000 సీసీ(పెట్రోల్), 2500 సీసీ(డీజిల్)కి పైబడిన 10,000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు. వీటిపై కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తారు. 1500 సీసీ నుంచి 3000 సీసీ శ్రేణిలోకి వచ్చే 5000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ కార్లపై దిగుమతి సుంకాన్ని 66 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తారు. దీని తర్వాత క్రమంగా సుంకాలను తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఈ కార్లపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తారు. దీంతో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్, జాగ్వార్, రోల్స్-రాయిస్, ఆస్టన్ మార్టిన్, బెంట్లీ వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Also Read
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
99 శాతం భారతీయ వస్తువులపై జీరో టారిఫ్:
ఇదే సమయలో భారత్ నుంచి బ్రిటన్‌కు ఎగుమతి అయ్యే వస్తువులపై జీరో టారిఫ్ ఉంటుంది. యూకేలో వస్త్రాలపై 12 శాతం సుంకం, రసాయనాలపై 8 శాతం, బేస్ మెటల్స్‌పై 10 శాతం సుంకం ఉంటుంది. కానీ ఇప్పుడు, ఈ ఒప్పందంతో, యూకేలో 99 శాతం వస్తువులు ‘0%’ సుంకం పరిధిలోకి వస్తాయి.
సగం ధరకే స్కాచ్ విస్కీ:
ప్రస్తుతం భారతదేశంలో స్కాచ్ విస్కీపై 150 శాతం దిగుమతి సుంకం ఉంది. ఎఫ్‌టీఏ అమలులోకి వచ్చిన తర్వాత ఈ సుంకాన్ని దశల వారీగా 40 శాతం వరకు తగ్గించనున్నారు. ఏకంగా 110 శాతం తగ్గడం ద్వారా బ్రిటిష్ స్కాచ్ విస్కీ చౌకగా మారుతుంది.
తాజావార్తలు
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
-
China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్‌ను దించిన చైనా!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!