Bharatiya Antriksh Station: 2035 నాటికి భారత్‌కి సొంత ‘‘అంతరిక్ష కేంద్రం’’
- 2023 నాటికి భారత్‌కి సొంత అంతరిక్ష కేంద్రం..
- ప్రకటించిన కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharatiya Antriksh Station: భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని, దీనిని ‘‘భారతీయ ఆంత్రిక్ష్ స్టేషన్’’ అని లుస్తామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శనివారం తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) , బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) మధ్య బయోటెక్నాలజీని, స్పేస్ టెక్నాలజీలో అనుసంధానం చేసే జరిగిన కీలకమైన ఒప్పందంలో సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ‘భారతీయ ఆంత్రిక్ష్ స్టేషన్’ స్థాపించడం, ‘బయోఈ3’ (ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం,ఉపాధి కోసం బయోటెక్నాలజీ) విధానాన్ని ఆవిష్కరించడం వంటి కీలక కార్యక్రమాలపై ఎంఓయూ కుదిరింది.
Read Also: India At UN: కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్..
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. ఈ ఒప్పందం మైక్రోగ్రావిటీ రీసెర్చ్, స్పేస్ బయోటెక్నాలజీ, స్పేస్ బయో మాన్యుఫ్యాక్చరింగ్, బయో ఆస్ట్రోనాటిక్స్, స్పేస్ బయాలజీ వంటి రంగాలపై దృష్టి పెడుతుంది. ఈ సహకారం సాధ్యమయ్యేలా కృషి చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలేలను మంత్రి అభినందించారు. భారత అంతరిక్ష రంగం వేగమైన వృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కీలకమని మంత్రి అన్నారు. స్పేస్ స్టార్టప్స్‌లు గణనీయంగా పెరిగాయని, దాదాపు 300 స్టార్టప్స్ ఇప్పుడు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయని చెప్పారు.
సెప్టెంబర్‌లో కేంద్ర క్యాబినెట్ చంద్రుడిపైకి వెళ్లే నాలుగో మిషన్‌కి ఆమోదం తెలిపింది. 2028 నాటికి భారతీయ అంత్రిక్ష్ స్టేషన్ (BAS) యొక్క మొదటి యూనిట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి తొలి భారతీయుడు చంద్రుడిపై ల్యాండ్ చేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం నాసాకి, చైనా స్పేస్ ఏజెన్సీకి సొంత అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!