Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూపై నిక్కచ్చిగా స్పందిస్తూ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద నెగిటివిటీ అనంతరం దర్శకుడు బుచ్చిబాబు స్పందన అనంతరం ఆమె ట్వీట్ చేయడంతో ఆ సినిమా పేరు ప్రస్తావించక పోయినా ఆమె ఈ అంశం గురించే ట్వీట్ చేసిందనే చర్చ జరుగుతోంది. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో సాగుతున్న కొన్ని ట్రెండ్స్‌పై, అలాగే సమాజం పట్ల సినిమా రంగానికి ఉండాల్సిన బాధ్యతలపై ఆమె పంచుకున్న కొన్ని స్క్రీన్‌షాట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
అనసూయ తన కెరీర్లో ఎదుర్కొన్న ఒక అత్యంత చేదు అనుభవాన్ని ఈ పోస్ట్‌లో బహిరంగంగా పంచుకున్నారు. గతంలో కొన్ని సామాజికాంశాలపై తను తీసుకున్న స్టాండ్స్, నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాల వల్ల.. సదరు మేకర్స్ క్రియేటివిటీకి తను పెద్ద అడ్డుకట్టలా మారాను అనే నెగటివ్ ముద్ర వేయడానికి ప్రయత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మనస్తాపంతోనే, తన గొంతు నొక్కేయాలని చూసిన ఒక పాపులర్ షో నుంచి తను పూర్తిగా తప్పుకోవాల్సి వచ్చిందని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అయితే ఆ షో ఏమిటి అనే విషయాన్నీ ఆమె చెప్పక పోయినా ఆమెకు పేరు తెచ్చిన జబర్దస్త్ గురించే ఆమె మాట్లాడుతోంది అనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి, ఒక ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి సరైన ప్లాట్‌ఫారమ్ దొరకక ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. అయినప్పటికీ, తను నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడటానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, భవిష్యత్తులోనూ వేయనని ఆమె ఎంతో ధైర్యంగా స్పష్టం చేశారు.
Also Read
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!