Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- చమురు మార్కెట్‌ను శాసించేది భారత్..
- 2035 నాటికి భారత్ వాటానే 50 శాతం ఉంటుంది..
- రష్యా చమురు సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: భారత్‌ను ఉద్దేశించి రష్యా ప్రభుత్వ చమురు దిగ్గజం రోస్నెఫ్ట్ సీఈఓ ఇగోర్ సెచిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో మాట్లాడిన ఆయన.. ప్రపంచ చమురు రంగంలో భారత్ భవిష్యత్తు పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్ధంలో ప్రపంచ చమురు డిమాండ్ పెరుగుదలలో దాదాపు 50 శాతం వాటా భారత్‌దే అని అంచనా వేశారు. 2035 నాటికి భారత చమురు వినియోగం రోజుకు సుమారు 8 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని, ఇది ప్రస్తుత స్థాయిలో పోలిస్తే 44 శాతం పెరుగుదల అని ఆయన చెప్పారు.
ఇదే సమయంలో, అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) అంచనాల ప్రకారం, ప్రపంచ చమురు డిమాండ్ కేవలం 5 శాతం మాత్రమే పెరుగుతుందని సెచిన్ అన్నారు. దీంతో రాబోయే రోజుల్లో చమురు మార్కెట్లో భారత్ అత్యంత కీలక వృద్ధి కేంద్రంగా మారబోతున్నట్లు చెప్పారు. 2022 ఏప్రిల్ ననుంచి రష్యా నుంచి భారత్, చైనాలు చమురు దిగుమతి చేసుకోవడం వల్ల గణనీయంగా ఆర్థిక ప్రయోజనం పొందాయని సెచిన్ వెల్లడించారు. ఈ లాభాల విలువ 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అన్నారు. రస్యాతో కొనసాగుతున్న ఇంధన భాగస్వామ్యం వల్ల స్థిరమైన సరఫరా సాధ్యమైందని, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో రష్యాను పెట్టడం సాధ్యం కాదని తెలిపారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం కలిగితే, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుదని సెచిన్ హెచ్చరించారు. ముఖ్యంగా భారత్, ఆగ్నేయాసియా దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటాయని అన్నారు. ఇంధన సంక్షోభం కారణంగా ఎరువుల ధరలు పెరగడం ద్వారా ఆహార ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడొచ్చని ఆయన అన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..