Site icon NTV Telugu

Nupur Sharma controversy: నుపుర్‌ శర్మ ఎఫెక్ట్.. భారత్‌పై సైబర్‌ వార్.. 2 వేల సైట్లు హ్యాక్‌..!

Hackers

Hackers

వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారి వార్తల్లో నిలిచారు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ.. మహ్మద్‌ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో.. పార్టీ పదవి నుంచి ఆమెను బీజేపీ తప్పించిన విషయం తెలిసిందే.. ఇక, సుప్రీంకోర్టు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, నుపుర్‌ శర్మ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా దుమారమే రేగింది.. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి భారత్‌పై, బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. ఇదే సమయంలో హ్యాకర్లు భారత్‌పై గురిపెట్టారు.. వేల సంఖ్యలో భారత్‌కు చెందిన సైట్లు హ్యాక్‌ అయినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తేల్చారు.

Read Also: Bandi Sanjay: రైస్ మిల్లర్లను కేసీఆర్ మోసం చేశారు

నుపుర్‌ శర్మ వ్యాఖ్యల తర్వాత భారత్‌పై పలు దేశాల నుంచి సైబర్‌ ఎటాక్స్‌ జరిగాయి.. దీనికి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టింది అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌.. ఆమె వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇండోనేషియా, మలేషియాకు చెందిన హ్యాకర్లు భారత్‌పై సైబర్‌ యుద్ధానికి తెరలేపారని.. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అమిత్‌ తెలిపారు.. సైబర్‌ దాడులు చేయడమే కాదు.. ఆ వర్గానికి చెందిన హ్యాకర్ల సైతం సైబర్‌ దాడులు చేయాలని ప్రేరేపించినట్టుగా చెబుతున్నారు.. దీనిపై ఆ రెండు దేశాలకు లేఖ రాశారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. భారత్‌పై సైబర్‌ దాడులకు దిగిన హ్యాకింగ్‌ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.. హ్యాకర్‌ గ్రూప్‌ భారత్‌లోని 2 వేలకుపైగా వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ చెబుతున్నమాట..

Exit mobile version