India Summons Canada Envoy Over Khalistan Protest: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలా పలు దేశాల్లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో అశాంతి చెలరేగేలా చేసేందుకు ప్రయత్నించిన ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ తన వేషాన్ని మార్చుకుని నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా కొన్ని రాడికల్ ఖలిస్తానీ శక్తులు భారత హైకమిషన్ కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నాయి. గత ఆదివారం, బుధవారం యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడులు చేశారు. భారత జాతీయ జెండాను అవమానపరచాలని చూశారు.
Read Also: Swara Bhasker: “పప్పు”కు మీరెందుకు భయపడుతున్నారు.. రాహుల్ గాంధీకి స్వరాభాస్కర్ మద్దతు
ఇదిలా ఉంటే కెనడాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది. కెనడా హైకమిషనర్ ను పిలిచి నిరసన వ్యక్తం చేసింది. మా దౌత్యవేత్తలు భద్రత కోసం కెనడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం, ఇలా అయితే వారు దౌత్యవిధులను నిర్వర్తించగలరని విదేశాంగశాఖ స్పోక్స్ పర్సన్ అరిందమ్ బాగ్చీ ఓ నోట్ లో వెల్లడించారు. పోలీస్ సమక్షంలో ఇలాంటి శక్తులను ఎలా అనుమతిస్తారని కెనడాని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నా భద్రతను ఎలా ఉల్లంఘిస్తారని దానికి జవాబు ఇవ్వాలని భారత ప్రభుత్వం కోరింది. వియన్నా కన్వేన్షన్ ప్రకారం ఈ దాడిలో పాల్గొన్న అందరిని అరెస్ట్ చేసి, విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. ఖలిస్తానీ మద్దతుదారుల హింసాత్మక చర్యల మధ్య భద్రతా కారణాలతో కెనడాలో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు చేయబడింది. నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై రాడికల్ ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు.