Site icon NTV Telugu

Jaish-e-Mohammed Base Camp: ఆపరేషన్ సింధూర్.. జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం..

Jaishe

Jaishe

Jaish-e-Mohammed Base Camp: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం ఇచ్చింది. ఇక, పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు చేసింది భారత రక్షణ శాఖ. ఈ దాడులు పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను గుర్తించి నాశనం చేసినట్టు ఇండియన్ ఆర్మీ పేర్కొంది.

Read Also: NTR : వార్ – 2 తెలుగు రైట్స్ కోసం ప్రొడక్షన్ హౌస్ ల మధ్య వార్

కాగా, భారత్‌ సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఈ హెడ్‌క్వార్టర్‌ ఉంది. సుమారు, 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. అలాగే, మసూద్ అజార్ ఆధీనంలోని ఈ టెర్రర్‌ క్యాంప్‌ను టార్గెట్ చేసి మరి ధ్వంసం చేసింది భారత ఆర్మీ. ఇక, జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్‌తో కలిసి ఈ శిబిరం నుంచే ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

Read Also: Rishabh : ‘కాంతారా చాప్టర్ 1 షూట్ లో మరో అపశృతి ..

అయితే, మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే లక్ష్యంగా భారత ఆర్మీ మిస్సైల్‌ దాడులకు దిగింది. బహావల్‌పూర్‌లోని ఉగ్ర స్థావరంపై మొదటి దాడి చేసిన ఇండియా.. 30 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపైనా క్షిపణులతో దాడులకు దిగింది. భారత్‌ మిస్సైల్‌ దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తి పోయింది. 6 చోట్ల దాడి చేసి 24 క్షిపణులను భారత్ ప్రయోగించిందని పాక్‌ ఆరోపించింది. ఈ దాడుల్లో సుమారు 8 మంది పాకిస్తాన్ ప్రజలు మృతి చెందగా 33 మందికి గాయపడినట్లు పాక్‌ ఆర్మీ అధికారి తెలిపారు.

Exit mobile version