NTV Telugu Site icon

India At UN: అయోధ్య, సీఏఏపై పాకిస్తాన్ కామెంట్స్.. భారత్ ఏం చెప్పిందంటే..

India At Un

India At Un

India At UN: పాకిస్తాన్ మరోసారి తన నైజాన్ని చాటుకుంది. వేదిక ఏదైనా భారత వ్యతిరేక స్వరాన్ని వినిపించడం మానడం లేదు. తాజా మరోసారి యూఎన్ వేదికగా మరోసారి భారత్‌ని ఉద్దేశించి మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ అయోధ్యలో రామ మందిరం, సీఏఏ గురించి వ్యాఖ్యానించారు. పూర్తి భారత అంతర్గత విషయమైన దీనిపై పాకిస్తాన్ వ్యాఖ్యానించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యల్ని ‘‘అరిగిన రికార్డు’’గా అభివర్ణించింది.

Read Also: Murder Mubarak: తెలుగులోనూ ఓటీటీలో విడుదలైన సారా, కరిష్మాల క్రైమ్ థ్రిల్లర్..!

శుక్రవారం జరిగిన సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ ‘ఇస్లామోఫోబియా’పై తీర్మానాన్ని ప్రకటించారు. 193 మంది సభ్యులతో కూడిన జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా భారత్‌ని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ వ్యాఖ్యలు చేసింది. మునీర్ అక్రమ్ అయోధ్యలో రామ మందిర ప్రతిష్టతో పాటు పౌరసత్వ సవరణ చట్టం అమలు గురించి ప్రస్తావించారు.

దీనికి ప్రతిగా భారత రాయబారి రుచిరా కాంబోజ్ మట్లాడుతూ.. నా దేశానికి సంబంధించిన విషయాలపై ఈ పాకిస్తాన్ పరిమిత, తప్పుదోవ పట్టించే దృక్పథాన్ని చూడటం నిజంగా దురదృష్టకరమని అన్నారు. భారతదేశం, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్ మరియు UKతో సహా 115 దేశాలు అనుకూలంగా ఓటేయగా.. వ్యతిరేకంగా ఏ దేశం కూడా ఓటేయలేదు. 44 దేశాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు.