భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 7,240 మంది వైరస్ బారినపడ్డట్లు తేలింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,723కి చేరింది. బుధవారం 3,591 మంది కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద ఉంది.
Nupur Sharma: నుపుర్‌శర్మ, నవీన్ జిందాల్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32,498 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు 4,31,97,522 మంది కరోనా బారినపడ్డారు. కరోనా బారినపడి 4,26,40,301 మంది కోలుకున్నారని ప్రకటించింది. భారత్‌లో బుధవారం 15,43,748 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,59,81,691కు చేరింది. మరో 3,40,615 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.