ఇండియా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ.. పెరుగుతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,081 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 264 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,40,275 కు చేరుకుంది. అలాగే రికవరీల సంఖ్య 3,41,78,940 కు చేరింది. ఇక మరణాల సంఖ్య 4,77,422 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 83,913 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. . ఇక గత 24 గంటల్లో 76,54,466 మందికి టీకా వేయగా… ఇప్పటి వరకు 1,37,46,13,252 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.