Covid 19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసులు 10 వేలకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,111 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. గడిచిన ఒక రోజులో 27 మరణాలు నమోదు అయ్యాయి. గుజరాత్ నుండి ఆరు మరణాలు నమోదవగా, ఉత్తరప్రదేశ్ నుండి నలుగురు, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్ నుండి ముగ్గురు, మహారాష్ట్ర నుండి ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు నుండి ఒక్కొక్కరు మరణించారు. ఫలితంగా ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,31,141కి పెరిగింది.
Read Also: Jagadish Shettar: బీజేపీ నాకు అన్నీ ఇచ్చింది.. కానీ ఆ విషయంలో బాధతోనే కాంగ్రెస్‌లో చేరా..
దేశంలో ఇప్పటి వరకు 4.47 కోట్లు (4,48,27,226) కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 8.40గా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల సంఖ్యలో 0.13 శాతంగా ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.68 శాతంగా ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ప్రస్తుతం 4,42,35,772కి చేరింది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదు అయింది. దేశంలో ఇప్పటి వరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే మరో 10 రోజుల వరకు కేసుల సంఖ్య ఇలాగే పెరిగే అవకాశం ఉందని, ఆ తరువాత తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
