Covid-19: దేశంలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: భారతదేశంలో ప్రతీరోజూ 10 వేలకు అటూఇటూగా కోవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తంగా 19 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 9 మంది ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుంది. అయితే నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య ఈ రోజు గణనీయంగా తగ్గింది. నిన్న ఒక్కరోజే 12,591 కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Tragedy : ఏడునెలల గర్భిణి అయిన భార్య మృతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న జవాన్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేట్ 5.08 శాతం ఉండగా.. నిన్న ఒక్కరోజులోనే 2,29,739 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 98.67 శాతంగా ఉండగా, మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.15 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించబడ్డాయి.
మరికొన్ని రోజలు వరకు కరోనా కేసులు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ స్టేజ్ లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉందని, మరో వారం రోజుల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB.1.16 సబ్ వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..