NTV Telugu Site icon

Covid-19: దేశంలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే..?

Covid 19

Covid 19

Covid-19: భారతదేశంలో ప్రతీరోజూ 10 వేలకు అటూఇటూగా కోవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తంగా 19 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 9 మంది ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుంది. అయితే నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య ఈ రోజు గణనీయంగా తగ్గింది. నిన్న ఒక్కరోజే 12,591 కేసులు నమోదు అయ్యాయి.

Read Also: Tragedy : ఏడునెలల గర్భిణి అయిన భార్య మృతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న జవాన్

ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేట్ 5.08 శాతం ఉండగా.. నిన్న ఒక్కరోజులోనే 2,29,739 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 98.67 శాతంగా ఉండగా, మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.15 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.

మరికొన్ని రోజలు వరకు కరోనా కేసులు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ స్టేజ్ లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉందని, మరో వారం రోజుల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB.1.16 సబ్ వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు.