Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles India Plans To Cut Eu Car Import Tariffs To 40 Ahead Of Historic India Eu Trade Deal Report

India-EU Trade Deal: యూరప్ కార్‌లపై భారీగా సుంకాల తగ్గింపు.. వోక్స్ వ్యాగన్, బెంజ్, బీఎండబ్ల్యూలు మరింత చవక..

Published Date :January 26, 2026 , 4:11 pm
By BV Reddy
  • ఈయూ కార్‌లపై భారీగా తగ్గనున్న సుంకాలు..?
  • భారత్-ఈయూ ట్రేడ్ డీల్‌‌లో భాగంగా చర్యలు..
  • మరింత చవకగా వ్యోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ, బెంజ్ కార్‌లు..
India-EU Trade Deal: యూరప్ కార్‌లపై భారీగా సుంకాల తగ్గింపు.. వోక్స్ వ్యాగన్, బెంజ్, బీఎండబ్ల్యూలు మరింత చవక..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-EU Trade Deal: చారిత్రాత్మక భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఈ ఒప్పందం కోసమే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్,యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా భారత పర్యటనలో ఉన్నారు. వీరిద్దరిని భారత 77వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. మంగళవారం, ప్రధాని మోడీతో ఈయూ చీఫ్ ఉర్సులా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ట్రేడ్ డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు భారీగా తగ్గించాలని భారత్ యోచిస్తోంది. ఈయూ తయారీ కార్‌లై 110 శాతం నుంచి 40 శాతానికి సుంకాలను తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లోని విస్తారమైన మార్కెట్‌ను ఈయూకు తెరిచే ప్రక్రియలో ఇది కీలకం కానుంది. 27 దేశాల కూటమి అయిన ఈయూ నుంచి 15,000 యూరోలు (రూ. 16.3 లక్షల) దిగుమతి ధర కలిగిన పరిమిత సంఖ్యలో కార్లపై పన్నును వెంటనే తగ్గించడానికి ప్రధాని మోడీ సర్కార్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సంవత్సరానికి సుమారు 200,000 డిజిల్- పెట్రోల్ కార్లపై దిగుమతి సుంకాలను తక్షణమే 40%కి తగ్గించాలని న్యూఢిల్లీ ప్రతిపాదించిందని సోర్సెస్ చెబుతున్నాయి. ఈ సుంకాలను కాలక్రమేణా 10 శాతానికి తగ్గిస్తారు.

Read Also: Indian Budget: భారత్‌లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది భారతీయుడా, కాదా? చరిత్ర పుటల్లో దాగి ఉన్న రహస్యం ఇదే..

ఈ నిర్ణయంతో ఈయూ మార్కె‌ట్ నుంచి వచ్చే వోక్స్ వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రసిద్ధ కంపెనీలకు భారత మార్కెట్లోకి ప్రవేశం మరింత సులువుకానుంది. ప్రస్తుతానికి చర్చల విషయాలు గోప్యంగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో మార్చులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ, యూరోపియన్ కమిషన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.

భారత్-ఈయూ మధ్య ట్రేడ్‌ డీల్‌ను ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా ఈయూ చీఫ్ ఉర్సులా అభివర్ణించారు. మంగళవారం స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కోసం సుదీర్ఘ చర్చలకు ముగింపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించగలదు. ఆగస్టు నుంచి 50 శాతం అమెరికా సుంకాలతో దెబ్బతిన్న భారత వస్త పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమలు యూరప్ దేశాలకు తమ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది.

తక్కువ దిగుమతి పన్నులు వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ , స్టెల్లాంటిస్ వంటి యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారులకు, అలాగే భారతదేశంలో స్థానికంగా కార్లను తయారు చేస్తున్నప్పటికీ, అధిక సుంకాల కారణంగా ఒక స్థాయికి మించి వృద్ధి చెందడానికి ఇబ్బంది పడుతున్న మెర్సిడెస్-బెంజ్ మరియు బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ సంస్థలకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. యూరోపియన్ కార్‌మేకర్స్ భారత్‌లో ప్రస్తుతం 4 శాతం కన్నా తక్కువ వాటాను కలిగి ఉన్నారు. అమెరికా, చైనా తర్వాత కార్ మార్కెట్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్‌ ఏడాదికి 4.4 మిలియన్ కార్ యూనిట్ల మార్కెట్, దీనిలో మారుతి సుజుకీ, మహీంద్రా, టాటాలలు కలిసి మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. 2030 నాటికి భారత్ మార్కెట్ ఏడాదికి 6 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • auto sector India news
  • global trade policy
  • India car import tariffs cut
  • India EU economic partnership
  • India EU FTA 2026

తాజావార్తలు

  • Story Board : ఇరాన్ యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ఇప్పటివరకు ఎవరికి ఎంత నష్టం జరిగింది..?

  • Tollywood: సినిమా జర్నలిజం కలుషితం అవుతోంది.. సంచలన లేఖ విడుదల చేసిన తెలుగు దర్శకుల సంఘం!

  • Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?

  • LPG Crisis: ఎల్పీజీ సంక్షోభం మధ్య కిరోసిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

ట్రెండింగ్‌

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions